ఆరవ శతాబ్దపు మధ్య కాలంలో ఉత్తర అరేబియాలో మూడు ప్రధాన నివాస ప్రాంతాలు ఉండేవి. అవన్నీ నైరుతి దిశలో.. ముఖ్యంగా ఎర్ర సముద్రం ప్రాంతంలో.. ఎర్ర సముద్రానికి తూర్పున ఉన్న ఎడారికి మధ్య మధ్య ఉన్న నివాస యోగ్యంలో ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని హిజాజ్ అని అంటారు. ఈ ప్రాంతం నీటి సౌకర్యాలు ఉన్న ఒయాసిస్. ఈ హిజాజ్ అనే ప్రాంతం మధ్యన మదీనా అనే పట్టణం అభివృద్ధి చెందింది.
ఈ పట్టణానికి దక్షిణ పర్వత ప్రాంతంలో తాయిఫ్ అనే పట్టణం ఉంది. తాయిఫ్‌కు వాయువ్య దిశలో మక్కా పట్టణం ఉండగా ఈ నగరంలోనే ముస్లింలకు అతి పవిత్రమైన మజీద్ అల్హారం అనే మసీదు ఉంది. ఈ మసీదులో పవిత్రమైన కాబా గృహం కూడా ఉన్నట్టు చరిత్ర చెబుతోంది.
హజ్ యాత్ర చేసే ముస్లింలందరూ ఇక్కడే హజ్ సాంప్రదాయంలోని కాబా గృహం చుట్టూ ఏడు ప్రదిక్షిణలు చేస్తారు. అయితే, కాబాలోకి మాత్రం ముస్లీంయేతరులకు ప్రవేశం లేదు. ప్రపంచ వ్యాప్తాంగా వివిధ దేశాల నుంచి దాదాపు నాలుగు లక్షల మందికిపైగా ముస్లింలు ఏటా హజ్ యాత్రలో భాగంగా మక్కాను సందర్శిస్తారు. తండ్రీ కొడుకులైన ఇబ్రహీం, ఇస్మాయిల్ దాహం తీర్చుకునన జలాశయం క్రమంగా బావిగా రూపాంతరం చెందింది. మక్కా పరిసర ప్రాంతాలన్నిటికీ ఈ బావే ప్రధానం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మక్కాలో రవాణా సౌకర్యం చాలా బాగుంటుంది. ఇక్కడి రాజకీయ పాలనలు ఎలా ఉంటాయంటే ఇస్లాం ప్రకారం అధినేతను ఎన్నుకోవాలి. కానీ, సౌదీ రాజరికంలో మక్కా నగరం నగర పాలకులతో పాలించబడుతోంది.