ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు మీడియాకి తెలిపారు.
ఆయన్ని మీరు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లిలో నిర్వహించిన మినీ మహానాడుకు ఎందుకు హాజరు కాలేదు అని ప్రశ్నించారు.దీనికి సమాధానంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ నేను టీడీపీ పార్టీకి ఎప్పుడో రాజీనామా చేశా ..నాకు పార్టీ కంటే బీసీల సంక్షేమమే ముఖ్యం .అయిన గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీసీల కోసం ఇచ్చిన ఏ ఒక్క ఎన్నిక హమీను చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా నెరవేర్చలేదు .
అంతే కాకుండా రాష్ట్రంలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.అలాంటప్పుడు ఆ పార్టీలో ఉండటం వృధా ప్రయాస.అందుకే బీసీలకు రాజ్యదికారమే లక్ష్యంగా పార్టీ పెట్టబోతున్నాను అని ఆయనమీడియాకు తెలిపారు అని వార్తలు వస్తున్నాయి.అయితే గతంలోనే బీసీలకు సంబంధించి ఒక సరికొత్త రాజకీయ పార్టీ పెడతాను ప్రకటించిన సంగతి తెల్సిందే .