ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు.నిన్న గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి లో టీటీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు .అయితే ఈ మహానాడుకు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మోత్కుపల్లి నరసింహులు ,ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే ఎస్ వెంకటవీరయ్య ,బీసీ సంఘం నేత ,టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య డుమ్మా కొట్టారు .అయితే వీరు రాకపోవడం వెనక బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .
అందులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్ సండ్ర వెంకటవీరయ్య త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ..కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నా వార్తలు.అయితే గతంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలని అనుకున్న కానీ కుదరక వెనకడుగు వేశారు .