టీఆర్ఎస్ పార్టీ యువనేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఎన్నికల వేళ టీఆర్ఎస్ సత్తా చాటారు. తెలంగాణ టీడీపీ మహానాడు నిర్వహించి అనవసర గాండ్రింపులు చేసి, తొడగొట్టిన తీరుకు తెల్లారే సరికే…మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత షాక్ ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ గూటికి చేరారు.
Inspired by the visionary leadership of KCR garu, leadership from jagtial join TRS in the presence of Hon'ble Minister @KTRTRS garu. pic.twitter.com/5UYe37n2Px
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 25, 2018
జగిత్యాల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ బోగ వెంకటేశ్వర్లు, బోగ ప్రవీణ్ టీఆర్ఎస్ గూటికి చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు గుర్తించి బంగారు తెలంగాణలో భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తెలంగాణ టీడీపీకి భవిష్యత్ లేదని, ఆ పార్టీలో కొనసాగడం వృథా అని టీడీపీలో ఉన్న కొందరు నేతలకు వెంకటేశ్వర్లు హితవు పలికారు.