తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశం జరిగి 24 గంటలు గడవకముందే ఆ పార్టీ కి పలువురు నేతలు షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు టీటీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతున్నారు .ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన మోహన్, ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి నాయకుడు పృథ్వీ రాజ్ యాదవ, తెలంగాణ ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొని టీ డీ పీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు . ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
