IPL-11 లో భాగంగా క్వాలిఫయర్-2లో నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల నష్టాని 174 పరుగులు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెలిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. 10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.ఇంతటి భారీ స్కోర్ అందించిన రషీద్‌పై పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రషీద్‌ని అభినందిస్తూ ఆసక్తికరమైన .. ట్వీట్ చేశారు. ‘‘ఇంతకాలం రషీద్ మంచి బౌలర్ అనే అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను ప్రపంచంలోనే ఈ ఫార్మాట్లో అత్యుత్తమమైన స్పిన్నర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గుర్తుంచుకోండి.. అతని గొప్ప బ్యాటింగ్ ప్రతిభ కూడా ఉంది. గ్రేట్ గాయ్’’ అని సచిన్ ట్వీట్ చేశారు.
Always felt @rashidkhan_19 was a good spinner but now I wouldn’t hesitate in saying he is the best spinner in the world in this format. Mind you, he’s got some batting skills as well. Great guy.
— Sachin Tendulkar (@sachin_rt) May 25, 2018