ఇస్లాం మతస్థులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్. రంజాన్ మాసంలో నెలంతా ఉపవాసం ఉండి వారి ప్రేమను, భక్తిని చాటుకుంటారు ముస్లింలు. ఉదయాన్నే నిద్రలేచి స్నానాలను ఆచరించి మూడు నుంచి ఐదు గంటల సమయంలో పలహారం లేదా భోజనం తీసుకుని ప్రార్ధనలు చేస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఆరు గంటలా 30 నిమిషాల లోపల ఉప వాసం ముగించి భోజనం తీసుకుంటారు. ఆ తరువాత మళ్లీ ప్రార్ధనలు చేస్తారు. అయితే, ఉపవాసం సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. ఇలా పూర్తిగా 30 రోజులపాటు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు.
అయితే, ఎండలు 50 సెంటి గ్రేడ్లు దాటిన సందర్భంగా ముస్లింలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. ప్రతీసారి చేసే విధంగా కాకుండా కాస్త పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఒంట్లో వేడి కలగకుండా నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, ప్రతీ రోజు తాము తీసుకునే ఆహారంలో కూడా ప్రొటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.