ప్రస్తుతం సాహో మూవీ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్న ప్రభాస్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ఇటీవల కాలంలో వివాదాస్పదమైన పలు అంశాలపై కూడా ప్రభాస్ స్పందించాడు. మహానటి సినిమా గురించి మాట్లాడుతు.. తనకు ఎంతో బాగా నచ్చిన నటి సావిత్రి అన్న విషయాన్ని బయటపెట్టాడు. తాను ఇండియాకు వెళ్లిన వెంటనే మహానటి మూవీని చూడబోతున్నానన్న విషయాన్ని తెలియజేశాడు.
ఇక రాజమౌళి, బాహుబలి చిత్రం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రభాస్. పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాహుబలిని ప్రదర్శించిన సందర్భంగా దర్శకుడు రాజమౌలి పాక్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ ప్రజలు రాజమౌళిని వెల్కమ్ చేసిన తీరు తనకు నచ్చిందని పొగుడుతూ.. సినిమాలకు మాత్రమే ప్రజలను దగ్గర చేసే పవర్ ఉంటుందని, ఇండియా, పాకిస్థాన్ ప్రజలను దగ్గర చేసే వారధిగా బా హుబలి మారటం తనకు ఆనందంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.