ఎట్టకేలకు టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తన తప్పును ఒప్పేసుకున్నారు.ఏపీని మోసం చేసిన బీజేపీకి కర్నాటకలో వెంకన్నచౌదరి తగిన బుద్ది చెప్పారని.. వెంకన్న చౌదరి సాక్షిగా ఇచ్చిన హామీని తప్పారంటూ రాజమండ్రి మహానాడులో వాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే అయన చేసిన ఈ వాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ ఆ విడియో అయ్యింది. టీడీపీ కుల పిచ్చి, అహంకారానికి పరాకాష్ఠ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు . అయితే ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదం కావటం వల్ల స్వయంగా అయన వివరణ ఇచ్చారు.
రాజమండ్రి మినీ మహానాడులో తాను తిరుపతి ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుజారిన మాట వాస్తవమే అన్నారు. అందుకు క్షమాపణలు చెప్పారు. అప్పటి వరకు బుచ్చయ్యచౌదరితో మాట్లాడుతూ.. ప్రసంగానికి పిలవడంతో వెంకన్న చౌదరి అనడం జరిగిందే తప్ప.. ఉద్దేశ పూర్వకంగా వచ్చింది కాదని జవాబు ఇచ్చారు . ఏడుకొండల వాడంటే ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయన్నారు. నోరుజారి అన్నమాటను ఇంత పెద్ద ఇష్యూ చేస్తారని అనుకోలేదని వివరణ ఇచ్చారు.