Home / POLITICS / ఆ ఫాల్తుగానితో పార్టీ నాశ‌నం..!!

ఆ ఫాల్తుగానితో పార్టీ నాశ‌నం..!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుపల్లి న‌ర్సింహులు ఒకింత గ్యాప్ త‌ర్వాత పెద‌వి విప్పారు. ఈ సంద‌ర్భంగా అనేక సంచ‌ల‌న విష‌యాల‌ను పంచుకున్నారు. బాబు త‌న‌ను అన్యాయం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాబు కోసం దెబ్బలు తిన్నాన‌ని, ఆయ‌న్ను నమ్మానని పేర్కొంటూ అలాంటి త‌న‌కు 5 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇవ్వలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “నేనెమన్న అల్తూ పాల్తూ గాన్న?రేవంత్ రెడ్డి కి అడ్డంగా మాట్లాడినదుకే నన్ను ఆలా చేస్తున్నారు` అంటూ ఆరోపించారు. `రేవంత్ రెడ్డి కూతురి పెళ్లి దగ్గర ఉంది అన్ని చేశాడు. నా బిడ్డ పెళ్ళికి ఎప్పుడో నాలుగు గంటలకి వచ్చాడు. చంద్రబాబును నమ్మొద్దు అంటే వినలేదు అని నా వాళ్ళు నన్ను తిడ్తున్నారు` అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి అప్రూవర్‌ మారుతాడని చంద్ర‌బాబు భయపడ్తున్నాడని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “ఒక ఫాల్తు గాన్ని పట్టుకొని పార్టీ ని నాశనం చేశారు. నాకు అపాయింట్మెంట్ ఇవ్వక పోవడాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను.

మాల మాదిగలకు గౌరవం ఇవ్వని నువ్వు అంబేద్కర్ విగ్రహాలు పెడతా అంటే ఎలా? ఎస్సీ వర్గీకరణఫై కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారు. మీరెందుకు వర్గీకరణ కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు? కేసీఆర్ డబ్బులు లేని వారికీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు. మీరెందుకు ఆ ప‌ని చేయ‌డం లేదు బాబు?“ అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఏపీలో రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందా రాదా అనే పరిస్థితి వచ్చిందని మోత్కుప‌ల్లి ఆరోపించారు. `నా తప్పేంటో చెప్పు…నీ ఇంటికి వచ్చి ముక్కు నేలకి రాస్తా. ఈ రాష్ట్రంలో నీ మాటకు విలువ ఎక్కడిది? కర్ణాటక పరిస్థితే ఇక్కడ వస్తది అంటున్నావు. నీకు లీడర్లే లేరాయే… ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? 6 నెలలకు ఒక్కసారి వస్తే ఇక్కడి కార్యకర్తల పరిస్థితి ఏంది? రేవంత్ ని నమ్మావు ఏమయింది?అవకాశం వస్తే రేవంత్ రెడ్డి ఎవరిమీదయిన కాలు పెట్టి పోతాడు“ అంటూ మోత్కుప‌ల్లి సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat