నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఇటీవల ఓ సోసల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు. మా నాన్న పేరు తిరుపాలయ్య, అమ్మ పేరు శైలజ అని చెప్పారు. ట్యాండ్స్ ఉన్నాయి. 1980లో నెల్లూరు జిల్లా పరిధిలోగల అంబాపురం అనే గ్రామానికి తన తండ్రి సర్పంచ్‌గా చేశారని చెప్పారు.
తనకు ఒక్క సంవత్సరం ఉన్నప్పుడే తన తన అన్న మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మరణించాడని ఇంటర్వ్యూలో భాగంగా ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. నాన్న కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు.
అలాగే, తానకు కూడా మూడుసార్లు ప్రాణగండాలు తప్పాయని చెప్పారు. ఒకసారి స్నేహితులతో కలిసి ఈత కొడుతున్న మయంలో, అలాగే, కర్ణాటకకు వెళుతున్న సమయంలో రోడ్డుపై ఒక్కసారిగా తాము ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టిందన్నారు. దేవుడి ఆశీస్సుల వల్ల ఆ ప్రమాదంలో ఒక్కరికి కూడా గాయాలు కాలేదని చెప్పారు. మరోసారి నాశిక్ టెంపుల్‌కు వెళ్లిన సమయంలో ఛార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా ఛార్టెడ్ ఫ్లైట్ గాల్లోనే పల్టీలు కొట్టిందని, ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు.