ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి పలువురు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో.. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వైఎస్సార్‌సీపీలో చేరారు.
బొబ్బిలి నియోజకవర్గానికి 1983,1985,1994 సంవత్సరాలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1994 లో టిడిపి విప్ గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏఐసీసీ మెంబర్‌గా కొనసాగుతున్నారు . ఈ సందర్భంగా అప్పలనాయుడికి పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు.అయితే ఈ విషయాన్ని దరువు.కామ్ ముందే చెప్పింది.