దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇటివల విడుదలైన సంగతి తెల్సిందే .అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూట నాలుగు స్థానాలు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.
అయితే కర్ణాటక రాష్ట్రంలో మిగత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడిన యడ్యూరప్ప ఆశలు అడియాశలు చేస్తూ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు.అందులో భాగంగా ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం ఈ రోజు శుక్రవారం బల నిరూపణ చేస్కోవాల్సి ఉంది.
అందులో భాగంగా స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ ను స్పీకర్ గా ఎన్నికున్న తర్వాత బలపరిక్షకకు దిగింది కుమారస్వామి ప్రభుత్వం .అయితే బల నిరూపణ సమయంలో బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేయడంతో కాంగ్రెస్ ,జేడీఎస్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కుమారస్వామి ప్రభుత్వం బల నిరూపణలో నెగ్గింది అని స్పీకర్ ప్రకటించారు .