Home / Uncategorized / హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరూ కలిసిరావాలి..మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరూ కలిసిరావాలి..మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులుగా చేయడం ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ మన నగరం కార్యక్రమాన్నిచేపడుతొంది. అందులోభాగంగానే ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో నిజాంపేటలో జరిగిన మననగరం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలతో పంచుకున్నారు .

నగర అభివృద్ధికి అందరూ కలిసి రావాలని ఆకాంక్షించారు. నగరాన్ని కాలుష్య రహితంగా చేయడానికి తిరుగుతున్న 3800 ఆర్టీసీ బస్సుల్లో దశల వారిగా మొదటగా 500 వాహనాలకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. పేదల బస్తీల నుంచి అధునాతన కాలనీల వరకు అన్నింటా సమగ్ర అభివృద్ధి ఉండాలన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటికీ పర్యావరణ అనుమతులు లభించాయని చెప్పారు. ప్రతి మనిషికి 150 లీటర్ల మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నామని చెప్పారు. విశ్వనగరం కావాలంటే అన్ని మౌలిక వసతులు ఉండాలన్నారు. ఒక్కరోజులోనే విశ్వనగరం ఏర్పాటు సాధ్యం కాదన్నారు.

800 కోట్ల రూపాయలతో కూకట్ పల్లి నియోజకవర్గంలో వివిధ దశల్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉండగా 3100 కోట్ల రూపాయలతో ఆధునికమయిన మురువునీటి వ్యవస్థ ఆధునీకరణ చేపట్టబోతున్నట్లు తెలియజేశారు, హైదరాబాద్ నగర్ రహదారుల అభివృద్ధికి 1100 కోట్ల రూపాయలతో వెచ్చిచడం జరుగుతుంది అని, దీనికోసం హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుమీద నగరంలో రోడ్లను అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం అని తెలియజేశారు.

పాదచారుల కోసం నగరంలో వివిధ చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణంతో పాటు అని నగరంలో 40 చెరువులను 540 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన చెరువులను ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నామని మంత్రి తెలిపారు. మంచినీటి విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామని తెలిపారు. 3 నెలల్లో 56 రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు. రానున్న 40 ఏళ్లు ఇబ్బంది లేకుండా పైప్‌లైన్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో నగర పాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతీ పౌరుడు కలిసి రావాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో ప్రతీ పౌరుడూ విధిగా క్రమశిక్షణ పాటించాలని అప్పుడే మనం ఆకాంక్షిస్తున్న విశ్వ నగర స్వప్నం సాకారం అవుతుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat