ఈ భూమ్మీద అత్యంత పవిత్రమైన మతాలలో ఇస్లాం ఒకటి. ఇస్లాంటి అంటే అర్థం శాంతి, స్వేచ్ఛ, సమానత్వం, సహాయం, ప్రతీ ముస్లిం దేవుడు ఒక్కడే అని నమ్మతుడాడు. అల్లాయే అందరికీ దేవుడు అని నమ్మతుడాడు. అంత పవిత్రమైన ముస్లిం మతం ఎలా పుట్టింది. మహ్మద్ ప్రవక్త చరిత్ర ఏమిటి..? ఆయన ఎవరు..? కాబా గృహం వెనుకున్న రహస్యాలేమిటి..? దానిని ఎవరు నిర్మించారో పూర్తిగా తెలుసుకుందాం.
ఇస్లాం మతం మొట్ట మొదటి మనిషి అయిన ఆదాముతో ప్రారంభించబడి మహ్మద్ ప్రవక్తతో పూర్తి చేయబడింది. అజ్ఞాన కాలంలో జన్మించిన ఇబ్రహీం, తన సతీమణి హజీరాతో కుమారుడు ఇస్మాయిల్‌తో ఒక ఇరుకైన, నిర్జీవమైన ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇబ్రహీం దైవాజ్ఞ పొంది భార్యను, కుమారుడ్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు భార్య అజీరా మమ్మల్ని ఎందుకు వెళుతున్నావని అడుగగా ఇది దైవ ఆజ్ఞ అని చెప్పి వెళ్లి పోయాడు. ఆ సమయంలో ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్‌కు దాహం వేస్తుంది. అప్పుడు ఇస్మాయిల్ తల్లి హజీరా తన కుమారుడి దాహం తీర్చమని దైవాన్ని ప్రార్ధిస్తుంది.
ఆ దేవుడి ఆజ్ఞ వల్ల వారికి ఒక నీటి మడుగు లభిస్తుంది. దీని ద్వారా వారు దాహాన్ని తీర్చుకుంటారు. ఇలా జరిగిన కొన్ని రోజుల తరువాత ఇబ్రహీం తరిగి వచ్చి తనపై జ్ఞానవెలుగు ప్రసాదించిన ప్రాంతంలో.. తన కుమారుడి సాయంతో ఒక గృహాన్ని పవిత్రమైన రాళ్లతో, మట్టితో నిర్మిస్తాడు. ఈ గృహమే కాబా గృహంగా పేరు పొందింది. ఈ గృహ నిర్మాణం జరిగిన తరువాత దీని చుట్టూ దైవ దూతలు ప్రార్థనలు జరిపినట్టు చరిత్ర చెబుతోంది. కాలానుగుణంగా ఈ ప్రాంతం ఒక గ్రామంలో మారిపోయింది. ఇస్మాయిల్ దాహం తీర్చిన మడుగు బావిగా మారి ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల దాహాన్ని తీరుస్తోంది. ఇలా చిన్న ప్రాంతంగా మొదలైన ఈ ప్రాంతం ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన మక్కా ప్రాంతంగా పేరు పొందింది.
అయితే, ప్రస్తుతం కాబా గృహం చుట్టూ నిర్మించిన నిర్మాణాలు అత్యంత పవిత్ర స్థలాలుగా మారిపోయాయి. ప్రతీ ముస్లీం తన జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించి, పుణ్యస్థలం చుట్టూ ఏడుసార్లు ప్రదిక్షణలు చేస్తారు. ఇలా ముస్లీం మతం ఆదాముతో ప్రారంభించబడి ఇబ్రహీంతో పునాది వేయబడి మహ్మద్ ప్రవక్తతో పూర్తి చేయబడింది.