ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి పప్పులో కాలేశారు .దీంతో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియాలో .గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో
హైదరాబాద్ లో త్రాగడానికి నీళ్ళు లేకపోతె నేను చేసిన కృషి ..
టీడీపీ ప్రభుత్వం పడ్డ శ్రమ ఫలితంగా నేడు హైదరాబాద్ వాసులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ,త్రాగునీరు లభిస్తుంది .అంతే కాకుండా ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ విమానాశ్రయం అయిన బేగం పేట్ విమానాశ్రయాన్ని టీడీపీ ప్రభుత్వం హయంలో ఏర్పాటు చేసి అంత్యంత సుందరంగా తీర్చి దిద్దామని మాట్లాడారు .ఇదే అంశం గురించి తన అధికారక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేశారు .
అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టడం దగ్గర నుండి అర్హులకు నోబెల్ అవార్డులిప్పించడం .సత్య నాదెళ్ళకు బీటెక్ చేయమని సలహా ఇవ్వడం లాంటి ఘనకార్యాలు చేసిన చంద్రబాబు బాబు పుట్టకముందే అంటే 1930లో నిజాం రాజులూ ఏర్పాటు చేసిన బేగంపేట్ విమానాశ్రయాన్ని తనే ఏర్పాటు చేశానని గబ్బలు చరుచుకుంటూ తన పరువును తానె తీసుకున్నాడు.ఎక్కడైనా చూపించండ్రా బాబు అంటూ నెటిజన్లు సెటైర్లు వర్షం కురిపిస్తున్నారు .