తెలంగాణ మహానాడు సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి భగ్గుమన్నారు. నిన్నటి మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యాలు “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు “అన్న చందంగా మారాయి కర్ణాటక ఫలితాలు ఇక్కడ పునరావృత్తం అవుతాయని పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. `అవును నిజమే కర్ణాటక ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం అవుతాయి` అంటూ బాబు తీరును ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టికి తెలంగాణాలో ఎప్పుడో రెండు చక్రాలు ఊడిపోయాయని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రలో ఆ పార్టీకి ఇప్పటికే ఒక చక్రం ఉడిపడిందని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటిస్తే ఆంధ్రలో కూడా తమ పార్టీయే క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. యావత్ భారతదేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని ఆయన అన్నారు. తెలంగాణాలో ఆ పార్టీకి డిపాజిట్లు రావని స్పష్టం చేశారు. ఊర్లో పెండ్లికి ఎదో హడావుడిలా కర్ణాటకలో చంద్రబాబు సీన్ మారిందన్నది ఆంధ్రప్రజల అభిప్రాయమని ఆయన అన్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం కనమన్నది పగటికలలు కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరం తానే నిర్మించానని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌ను నిర్మించిన నిజాం రాజు కూడా ఎప్పుడు ఈ విధంగా చెప్పుకున్నట్లు గుర్తు లేదని మంత్రి అన్నారు. నాలుగు భవనాలు నిర్మించి రాజధానిని తానే నిర్మించానని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.