ఏపీ ప్రధానప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు .
ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎ గోపవారానికి చెందిన గండ్రోతు నాగదేవి అనే మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు .ఈ సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ అన్నా జగనన్న అంటే నాకు ప్రాణం .నాడు వైఎస్సార్ మాలాంటి వెనకబడిన అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికై కృషి చేశారు .
ఆయన మరణం తర్వాత వైసీపీ జెండా మోస్తున్నాను .అయితే తమను కాదని వైసీపీ జెండాను మోస్తున్నాను అని టీడీపీ నేతలు మహిళ అని చూడకుండా అక్రమ కేసులు బనయిస్తున్నారు .వేదింపులకు గురిచేస్తున్నారు .అయిన వెనక్కి తగ్గేది లేదు దాదాపు పదిహేను యేండ్ల కిందట నాడు వైఎస్సార్ తో నడిచా ..నేడు జగనన్నతో నడుస్తా అని ఆమె అన్నారు .