రాథికా ఆప్టేపై వైరల్ న్యూస్..!! అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరియర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన హీరోయిన్లలో రాథికా ఆప్టే ఒకరు. అటువంటి రాథికా ఆప్టేకు బ్లడ్ క్యాన్సర్ అంటూ ఇటీవల కాలంలో ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది. రాథికా ఆప్టే బ్లడ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాదపడుతోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అందుకే ఆమె బయట కనిపించడం లేదని ఆ సోషల్ మీడియా కథనం పేర్కొంది.
అయితే, ఇదే విషయాన్ని ఓ అభిమాన్ని ట్వీట్టర్ వేదికగా రాథికా ఆప్టేను ప్రశ్నించాడు. వెంటనే స్పందించిన రాథికా ఆప్టే తనకు ఎలాంటి ప్రాణాంతకర వ్యాధి లేదని తెలిపారు. తనపై వచ్చే వార్తలన్నీ పుకార్లేనంటూ సోషల్ మీడియా కథనాన్ని కొట్టిపారేసింది. తనకు ప్రాణాంతకర వ్యాధి ఉందంటూ కథనాలు ప్రచురిస్తున్న సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటానంటూ ట్విట్టర్‌లో తెలిపింది రాథికా ఆప్టే.