ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అతడితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి దెబ్బకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలింది. తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ ఆమె మరిన్ని ఫోటోలు లీక్ చేశారు.
ఒకరి జీవితాన్ని నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవడం చాలా కష్టం. సినిమా రంగంపై ఇష్టంతో తమ భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో కలలతో ఇటు వైపు వస్తున్నారు. కానీ నిర్మాతలు, దర్శకులు, వారి కొడుకులు, బంధువులు అలా వచ్చే అమ్మాయిల పాలిటి విలన్స్‌లా దాపురించారు. అమ్మాయిల దేహాలను, వారి రక్తమాంసాలను తమ ఆస్తిలా భావిస్తున్నారు…. అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.