ఐపీఎల్ – 2018 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమణతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అందుకే అందరి మీద కోపం చేసుకుంటున్నాడా..? భార్య అనుష్కను కూడా వదిలిపెట్టడం లేదా..? రా చూసుకుందామంటూ ఎం.ఎస్ ధోనీతో ఎందుకు ఛాలెంజ్ చేశాడు..? సాక్ష్యాత్తు ప్రధాని మోడీతో కూడా సై అంటే సై అంటూ గొడవకు దిగుతున్నాడా..? అసలేం జరుగుతోంది. అసలు నిప్పు రాజేసింది ఎవరు..? ఎందుకు అంత సీన్ క్రియేట్ అయింది..? లెట్స్ హావ్ ఏ లుక్.
కేంద్రమత్రి రాజ్యవర్దన్ సింగ్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టాడు. ఫిట్ గా ఉండాలంటే మీరు ఏం చేస్తారో.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో పెట్టి మీ సన్నిహితులకు ఛాలెంజ్ విసరండి అంటూ పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా తాను ఫిట్‌గా ఉండటానికి గల కారణాలను తెలియజేస్తూ ఓ తాను చేసిన ఎక్సైర్సైజ్ వీడియోను
సోసల్ మీడియాలో పెట్టడమే కాకుండా విరాట్ కోహ్లీతోపాటు పలువురికి సవాల్ విసిరారు. ఆ వెంటనే స్పందించిన కోహ్లీ జిమ్‌కు వెళ్లి తనకు నచ్చిన ఫార్మేట్ ఎక్సర్సైజ్ చేసి సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ప్రధాని మోడీకి తన భార్య అనుష్క శర్మతోపాటు ధోనికి సవాల్ విసిరాడు.
ప్రధానికేమిటి.. క్రికెటర్ కోహ్లీ సవాల్ విసరడమేంటి అని అంరదూ అనుకున్నారు. ప్రధాని మోడీ మాత్రం చాలా కోహ్లీ ఛాలెంజ్‌ను చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు. విరాట్ కోహ్లీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. క్షణం కూడా ఆలస్యం చేసకుండా తాను చేసిన ఎక్సర్సైస్ వీడియోను త్వరలో సోసల్ మీడదియాలో పెడతానంటూ ట్వీట్ చేశాడు.