మెగా ఫ్యామిలీ నుంచి ఏ వార్త వచ్చినా సెన్షేషన్ అవుతుంటుంది. సెన్షేషన్ అవ్వాలనే కొన్ని వార్తలు అలా వస్తుంటాయ్. తన ప్రేమకు మెగా ఫ్యామిలీనే అడ్డు అంటూ నిహారిక ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట చెప్పిందంటూ ఓ వార్త నెట్టింట్లో ట్రోల్ అవుతోంది. అయితే, సినీ ఇండస్ట్రీలోని సీనియర్ హీరో వారసులుగా చాలా మంది వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అందులో మెగా హీరోలు ప్రత్యేకం. లెక్కకు మించి మెగా కుటుంబం నుంచి హీరోలుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వారిని మాత్రం వేళ్ల మీద లెక్క పెట్ట వచ్చు. ఆమెను కొణిదెల నిహారిక.
ప్రస్తుతం ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తోంది. తెలుగు తోపాటు తమిళంలో కూడా ఈ కొణిదెల హీరోయిన్ సినిమాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ పరువు తీయకుండా సినిమాలు చేస్తానని ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక చెప్పుకొచ్చింది.
ఎవరైనా తనకు లవ్ ప్రపోజల్ చేస్తే చూడాలని ఉందని, ఇప్పటి వరకు ఆ కోరిక తీరలేదంటూ చెప్పింది. నా కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నా.. లవ్ ప్రపోజల్ కోసం.. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఆ సాహసం చేయలేదు. బహుశా నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసి ఏమో ఎవరూ నాకు ప్రపోజల్ చేయలేదని చెప్పుకొచ్చింది కొణెదల హీరోయిన్ నిహారిక.