సెలెబ్రెటీలు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలునిచ్చారు.ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కేన్సర్ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో… అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.బసవతారకం ట్రస్ట్ కు ముఖ్యమంత్రి పన్ను మినహాయింపు ఇవ్వటం వల్ల ఎంతో మందికి లాభం కలుగుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. బసవతారకం ఆస్పత్రి పన్ను రద్దు చేయాలని పదేళ్లలో ముగ్గురు సీఎంలను అడిగినా చేయలేదని.. సీఎం కేసీఆర్ పన్ను రద్దు చేశారని మంత్రి తెలియజేశారు. బసవతారకం ఆస్పత్రి బయట షెల్టర్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి.. అవసరమైతే మరిన్ని షెల్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.తనకు ఇష్టమైన నటుడు బాలయ్య అని, ఆయనకు చెందిన ఆసుపత్రి అభివృద్ధి చెందడం గర్వకారణంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
