హైదరాబాద్‌లో నగరంలో ఈనెల 26న పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు బుధవారం తెలిపారు. నగరంలోని ఎలుగుట్ట రిజర్వాయర్ వద్ద ఇన్‌లెట్ మెయిన్ జంక్షన్ పనులు నిర్వహిస్తుండడంతో కృష్ణ పేజ్-2, రింగ్ మెయిన్-2ను ఈ నెల 26న బంద్ చేయనున్నారు. దీంతో శనివారం ఉదయం 6గంటల నుంచి 24గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా నాచా రం, హబ్సీగూడ, చిలకానగర్, ఎలుగుట్ట, రామంతాపూర్, హెచ్‌ఎంటీనగర్, తార్నా క, లాలపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, మారేడుపల్లి డివిజన్‌లోని అన్ని ప్రాంతాలు, బోడుప్పల్, బోయగూడ, బీరప్పగడ్డ, రెంజిమెంటల్‌బజార్, మేకలమండి నల్లగుట్ట, శ్రీనివా్‌సనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతాపల్‌మండి, కంటోన్మెంట్ గౌగ్‌లైన్స్, ఎంఈఎస్, షిప్‌మండి, బౌద్ధనగర్, హుస్సేన్‌సాగర్ పంప్‌హౌస్, అద్ధయ్యనగర్‌లలో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు.
Tags colonys hyderbaad watter problam