Home / ANDHRAPRADESH / ఆయన వచ్చారు..ఆడవారికి రక్షణ లేకుండా పోయింది ..!

ఆయన వచ్చారు..ఆడవారికి రక్షణ లేకుండా పోయింది ..!

సినిమాల ప్రభావమో ..లేదా ప్రభుత్వ విఫలమో లేదా ..తమ వెనక అధికార పార్టీకి చెందిన నేతల అండ ఉందనో ..కారణం ఏదైనా కానీ ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి .గంటకో లైంగిక దాడి ..రోజుకో అత్యాచారం ఇలా పలు దారుణాలు మహిళలపై జరుగుతున్నాయి .సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో కేవలం పదకొండు ఏళ్ళ బాలికపై నలుగురు యువకులు ఒకటి కాదు రెండు రోజులు కాదు ఏకంగా రెండు నెలలు నుండి అత్యాచారానికి పాల్పడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఇటివల టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన మూవీ మాదిరిగా నెల రోజులుగా ఒక యువతిని బంధించి అత్యాచారానికి
పాల్పడినట్లు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భగత్ సింగ్ కాలనీలో ఏకంగా రెండు నెలల నుండి అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది .ఈ కాలనీకి చెందిన పదకొండు ఏళ్ళ బాలికపై నలుగురు యువకులు రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు.అంతే కాకుండా ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తామని ..మాకు వారు తెలుసు ..వీళ్ళు తెలుసు అంటూ బెదిరిస్తూ మరి ఈ దారుణానికి ఉసిగొల్పారు .

అయితే చివరికి ఈ టార్చర్ తట్టుకోలేక బాలిక వాళ్ళ అమ్మకు చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ..దీంతో ఈ దారుణం గురించి గ్రామస్తులకు చెప్పడంతో యువకులను గాలించి ఇద్దర్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.మిగతా ఇద్దరు పరారిలో ఉన్నారు .అయితే ఆయన వస్తే రక్షణ ఉండటం పక్కనపెట్టి ఆయన వచ్చినాకే మహిళలపై లైంగిక దాడులు ,అత్యాచారాలు ఎక్కువైయ్యాయి అని ఏకంగా సాక్షాత్తు డీజీపీ ప్రకటించిన వివరాల ప్రకారం అర్ధమవుతుంది ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat