ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కాంక్షతో, ప్రజలు మోసం చేసేందుకు కూడా వెనకాడకుండా అబద్ధపు హామీలు గుప్పించి, అలాగే.. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, సింగపూర్, జపాన్లను తలపించే రాజధానిని నిర్మిస్తానంటూ ప్రజలను నమ్మించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీరేవరో నాకు తెలీదు అన్నట్టు ప్రజలతో వ్యవహరించడం గమనార్హం. టీడీపీ ఇచ్చిన హామీలను ప్రతిపక్ష సభ్యులు గుర్తు చేస్తే తప్ప.. చంద్రబాబు ముందుకు కదలని పరిస్థితి. ఇలా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో అవినీతి రాజకీయం ఎలా చేయాలో బాగానే నేర్చుకున్నారంటూ ఏపీ ప్రజలు సెటైర్ష్ వేస్తున్నారు.
ఇదిలా ఉండగా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ ఆదాయం పెరగకపోగా గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, తెలుగుదేశం పార్టీ ఆదాయం మాత్రం నాలుగు రెట్లు పెరగడమే కాకుండా దేశంలోనే ఎండో స్థానాన్ని ఆక్రమించింది.
కాగా, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ కి సంబంధించిన గత రెండేళ్ల ఆదాయాలను పరిశీలిస్తే టీఆర్ఎస్ (2015 – 16) రూ.8.908 కోట్లు ఉండగా, 2016 – 17లో 3.79 కోట్లు మాత్రమే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాయం రూ.1.91 కోట్ల నుంచి 0.94 కోట్లకు తగ్గింది. ఇక టీడీపీ విషయానికొస్తే.. 2016 – 17 సంవత్సరంలో రూ.72.92 కోట్లుగా ఉంది.
ఏదేమైనా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పేరిట భూ సంస్కరణలు అంటూ రైతుల నుంచి కోట్ల విలువ చేసే భూములను లాక్కున్నా.. చివరకు పరిశ్రమల ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుచేసి సమావేశాలు నిర్వహించినా ఏపీ ఆదాయం పెరగకపోగా.. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆదాయం పెరగడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.