లవంగాలను సాధారణంగా మనం వంటల్లో ఎక్కువగా వేస్తుంటాం.లవంగాల వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అవి చాలా ఘాటుగా కూడా ఉంటాయి. అందువల్ల ఆ రుచి కోరుకునే వారికి వంటలు పసందుగా అనిపిస్తాయి. అయితే కేవలం వంటలే కాదు, లవంగాల వల్ల మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లవంగాల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనను పోగొడతాయి.
2. వాంతులు, వికారం వంటి లక్షణాలను లవంగాలు తగ్గిస్తాయి.
3. ఆహారం సరిగ్గా జీర్ణం కాని వారు భోజనం చేయగానే ఓ లవంగం నోట్లో వేసుకుని నమిలితే చాలు. ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. దీంతోపాటు గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
4. ఒక గ్లాస్ నీటిని పాత్రలో పోసి అందులో లవంగాలు వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి. ఇలా తాగడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు పోతాయి.
రాత్రి పుట నిద్ర సరిగ్గా పట్టడం లేదా..? ఇలా చేయండి..!
5. లవంగాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
6. లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఇవి కండరాలు, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి.
7. ఒక గ్లాస్ పాలలో 1/4 టీస్పూన్ లవంగాల పొడి, రాతి ఉప్పు (రాక్ సాల్ట్) కలిపి తాగితే తలనొప్పి వెంటనే తగ్గుతుంది.
8. లవంగాలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
9. బాగా దాహం అవుతున్నప్పుడు 1, 2 లవంగాలను నోట్లో వేసుకుని నమిలితే అతి దాహం సమస్య తీరుతుంది.