శ్రీరెడ్డి, టాలీవుడ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి కారణమని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవకాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. అయితే, గతంలో శ్రీరెడ్డి లీక్స్ పేరుతో తనతో కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో అభిరామ్ బాబాయ్ అయిన సినీ హీరో వెంకటేష్ క్లాస్ పీకాడంటూ ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జీవితమంటే సినిమా కాదురా అయ్యా..! ప్రతీదీ సెన్సార్ బోర్డు చూసుకునేదానికి అంటూ అభిరామ్‌పై వెంకటేస్ ఫైర్ అయ్యాడట. శ్రీరెడ్డి ఫోటులో లీక్ చేసిన వెంటనే అభిరామపై రియాక్ట్ అయితే.. ఏమన్నా జరిగే అవకాశం ఉన్నందున కాస్త ఆలస్యం అయినా అభిరామ్‌కు జీవితమంటే ఏమిటో బోధించాడంట వెంకటేష్.