ఏపీ ప్రధాన ప్రతిపక్ష పక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .
ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మియ్యేరు గ్రామానికి చెందిన కొవ్వూరు జగన్ రెడ్డి అనే బాలుడు పంచె కట్టుకొని ,కండువాతో అచ్చం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను గుర్తుకు తెస్తూ జగన్మోహన్ రెడ్డితో కల్సి పాదయాత్రలో పాల్గొన్నారు .అయితే బుడతడు వేస్తున్న అడుగులతో అందరు ఎంతో ఆనందానికి గురై ..వైఎస్సార్ ను గుర్తుకు తెచ్చుకున్నారు ..