వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉన్న ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెరగని ముద్ర వేసుకుంటుంది. దీనికంటికీ కారణం వైఎస్ జగన్ చెపట్టిన ప్రజా సంకల్ప యాత్రేనని చెప్పడంలో ఎటువంటి సందేహాలకు తావు లేదు. వైసీపీపై రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఏపీలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాలపై సర్వే చేశాయి. ఆ సర్వేల్లోనూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు వెలువడ్డాయి.
ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజల మద్దతును చూసిన పలు పార్టీల నేతలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్వరలో బిగ్ షాక్ తగలనుందా..? రెండు దశాబ్దాలపాటు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకుడు వైసీపీలో చేరనున్నాడా..? దీనికి కారణం హోం మంత్రి చిన్నరాజప్పేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక అసలు విషయానికొస్తే.. పశ్చిమగోదావరి జిల్లా పెద్దపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే స్థానంలో ఉన్న బొడ్డు భాస్కర రామారావు టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బొడ్డు భాస్కర రామారావు పెద్దాపురం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. అందుకు హోమంత్రి చిన్న రాజప్ప మోకాలడ్డుతున్నాడు. దీనికంతటికి కారణం చిన్నరాజప్ప కూడా పెద్దాపురం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే. ఈ విషయాన్ని బొడ్డు భాస్కర రామారావు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన బొడ్డు భాస్కర రామారావు టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారని, అలాగే, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారంటూ ఆ జిల్లా ప్రజల సమాచారం.