తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, 20 ఏళ్ల క్రితమే వద్దనుకున్నానని టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. తెలుగువారికి సేవ చేయడమే తన లక్ష్యంమని అయన స్పష్టం చేశారు.ఈ రోజు తెలంగాణ టీడీపీ మహానాడుకు చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అయన ప్రసంగించారు.నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్‌కు రూపకల్పన చేశారని అన్నారు . ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేవెగౌడను ప్రధానిని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో పెను మార్పులు వస్తాయని ..దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎవరు ఎన్ని కక్షలు కట్టినా టీడీపీని ఏమీ చేయలేరని, పార్టీ జోలికి వస్తే షాక్ కొడుతుందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మోసం చేశారని అన్నారు . తెలుగు రాష్ట్రాలకు మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు.
