తనని నమ్మినవారిని ఎలా మోసం చేయాలో ..ఎలా తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ .
అయితే తాజాగా వారు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతరామన్ భర్త డాక్టర్ పరకాల ప్రభాకర్ కి బిగ్ షాకిచ్చారు .
ఇటివల కేంద్రం నుండి వైదొలిగిన టీడీపీ ఆ తర్వాత బీజేపీ పార్టీతో తెగదెంపులు చేసుకుంది .అందులో భాగంగా కలెక్టర్ల సదస్సులో భాగంగా చంద్రబాబు నాయుడు పరకాల ప్రభాకర్ పక్కన ఉండగానే ఎం గ్రూపుకు చెందిన సంజయ్ అరోరాను ప్రభుత్వ మీడియా సలహాదారుగా పరిచయం చేసిన తనని నమ్మినవారికి ఎలా వెన్నుపోటు పోడుస్తారో అలా చేశారు .దీంతో షాక్ కు గురి కావడం పరకాల వంతైంది ..