ఇటీవల కాలంలో బుల్లితెర మీడియా ఛానళ్లు తమ సంస్థనే టాప్ రేటింగ్‌లో ఉండాలన్న ఉద్దేశంతో యాంకర్లను బాగా వాడేస్తున్నారు. దీంతో టీవీ ఛానళ్లకు రేటింగ్.. యాంకర్లకు రెమ్యునరేషన్‌తోపాటు యమ క్రేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా వివాదం వస్తే.. ఆ అపవాదు కాస్తా యాంకర్లపై పోతుందే తప్ప చానళ్లకు కాదు కదా మరీ. ఎంత క్రేజ్ ఉంటేనే అంత మంచి అవకాశాలు వస్తాయి. అందులో భాగంగానే తక్కువ సమయంలో పాపులర్ కావాలని ఆరాట పడుతూ యాంకర్లు ఎంతకైనా తెగించేస్తున్నారు. ఇందుకు ఛానెళ్ల యాజమాన్యం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెచ్చిపోతున్నారు. ఇలా రెచ్చిపోతూ వివాదాలకు కారణమవుతూ నిత్యం ప్రజల నోట్లలో నానుతూ.. పాపులారిటీ సంపాదిస్తున్నారు యాంకర్లు. ఈ పాపులారిటీ కాస్తా వారికి అడక్కుండానే అవకాశాలను తెచ్చిపెడుతోందనడంలో అతిశయోక్తి లేదు.
అటువంటి షోలలో మొదటిగా చెప్పుకోవాలసింది ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఢీ. ఆ ప్రోగ్రామ్‌లో యాంకర్‌గా ప్రదీప్, సుధీర్, రష్మీ చేసే హంగామా అంతా ఇంతా కాదు. రష్మీ వేసే ప్రతి పంచ్‌కు పగలబడి నవ్వడం ప్రదీప్, సుడిగాలి సుధీర్ ల వంతైతే. అందుకు తగ్గట్టుగా రష్మీ హావభావాలు పలకడం మరో వంతు. ఒకరిపై మరొకరు పంచ్‌లు వేసుకుంటూ కామెడీ పండించే క్రమంలో హద్దులు మీరుతున్నారు. ఒకానొక సమయంలో ఏకంగా ముద్దులు కూడా పెట్టుకున్నారు. అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది.
అయితే, ఇదే విషయమై సుడిగాలి సుధీర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. ఒక్కో షో డిజైన్ చేయడానికి సుమారు ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఒక క్రియేటివిటీ డైరెక్టర్, ఒక ప్రొడక్షన్, సెట్ బాయ్స్, డైరెక్షన్ టీమ్, ఒక అరవై, డెబ్బై మంది కలిస్తే గాని ఒక ఎపిసోడ్ పూర్తి కాదు. అటువంటి షోను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తాము ఇంకా కష్టపడతాము తప్పా.. అందులో మరేమీ లేదన్నారు. షోలో భాగంగా తనవి(సుడిగాలి సుధీర్), రష్మీ ఉన్న స్టిల్స్‌ను బయటకు తీసి కొన్ని మీడియా చానళ్లు తమపై అసభ్యకరంగా రాశాయన్నారు.
ఒక్క విషయంలో చెప్పాలంటే మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం అన్నా చెల్లి బంధమేనంటూ చెప్పుకొచ్చాడు. మితిమీరిన వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఉంటేనే షోలు సక్సెస్ అవుతుంటాయంటారా? అన్న విలేఖరి ప్రశ్నకు స్పందించిన సుడిగాలి సుధీర్ ఒక వేళ బుల్లితెరకు సెన్సార్ పెడితే అందులో ఢీ ప్రోగ్రామ్ ఎటువంటి కట్స్ లేకుండా బయటకు వస్తుందని రిప్లై ఇవ్వడం మరో విశేషం.