కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ నేతృత్వంలోని ఏర్పడనున్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ,జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వం పట్టు మని పది నెలలు కాదు కదా కనీసం ముచ్చటగా మూడు నెలలు కూడా నిలబడదు.
ఆ ప్రభుత్వం పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు .అంతే కాకుండా ఈ రోజును ప్రజాతీర్పు వ్యతిరేక దినంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పాటించాలని ఆయన సూచించారు .అయితే ఇటివల విడుదలైన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ నూట నాలుగు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే ..