ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన నగలు ,ఆభరణాలు ,ఆస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి .
వాటిని చంద్రబాబు అధికారక నివాసమైన ఏపీలోని అమరావతి ,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఉన్న తన సొంత ఇంట్లో ఉన్నాయి .వాటిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ,సీబీఐ అధికారులు పన్నెండు గంటల్లో విచారణ చేయాలి ..సోదాలు నిర్వహిస్తే తప్పకుండ అవి బయటకు వస్తాయి .
అలా జరగని పక్షంలో నేను ఎంపీ పదవికి పదమూడు గంటల్లోనే రాజీనామా చేస్తాను అని ఆయన చంద్రబాబు సర్కారుకు సవాలు విసిరారు .అయితే గత కొంతకాలంగా టీటీడీ మమాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మాట్లాడుతూ తిరుమలలో ఆభరణాలు లేవు .పింక్ డైమండ్ లాంటి వజ్రాలు ,ఆభరణాలు లేవు అని ..వాటిని ఎవరో దొంగిలించారు అని ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే ..