ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతోందని ఏపీ బీజేపీ నాయకులు తీవ్రంగా మండి పడ్డారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు మీద దాడికి దిగిన టీడీపీ నాయకులను విడిచిపెట్టి అమిత్ షాకు రక్షణగా నిలిచిన బీజేపీ నేతల మీద అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య అన్నారు. సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే అమిత్ షా కాన్వాయ్‌పై దాడి జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు.
ఏపీలో జరుగుతున్న సంఘటనల మీద దృష్టి సారించి అలాగే, బీజేపీ నేతలపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులను అరికట్టాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలే కానీ.. ఇలా అవినీతిపై ప్రశ్నించిన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించడమేంటని సోము వీర్రాజు, మాణిక్యాల రావు ప్రశ్నించారు.