దాదాపు నాలుగు దశాబ్దాలుగా పైగా ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ,కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అభిమానులల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి శ్రీదేవి .అయితే ఆమె దుబాయ్ లో జరిగిన తన కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి హాజరై అకస్మాత్తుగా బాత్రూం లో పడి మరణించారు .అయితే అప్పటి నుండి నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు .
ఈ క్రమంలో ఆమెను హత్య చేశారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రచారం చేస్తున్నారు.అందులో భాగంగా ఆమె పేరుతొ ఉన్న మొత్తం రెండు వందల నలబై కోట్ల రూపాయలే ఇందుకు ప్రధాన కారణమని ఆ వార్తల ప్రచారం .అంతే కాకుండా ఈ విషయంలో దావూద్ ఇబ్రహీం పాత్ర కూడా ఉందని కూడా ప్రచారం చేస్తున్నారు .
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నిర్మాత నటి మృతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ లో సదరు నిర్మాత పేర్కొనడం గమనార్హం ..అయితే ఒక వ్యక్తి పేరిట రెండు వందల నలబై కోట్ల రూపాయలు బీమా ఉంటుందా .అయితే ఇలాంటి నియమం ఏ బీమా సంస్థలో ఉండదు అని కూడా మరో ప్రచారం జరుగుతుంది .అయితే ఏది నిజమో కాలమే నిర్ణయించాలి .ఎందుకంటే ఇప్పటికే దుబాయ్ పోలీసులు అకస్మాత్తుగా బాత్రూమ్లో జారి టబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు అని తేల్చేసిన సంగతి తెల్సిందే .