ప్రభుత్వ రంగానికి చెందిన [ప్రముఖ జాతీయ బ్యాంకు ఎస్బీఐ భారీ నష్టాల్లో కూరుకుపోయింది .అందులో భాగంగా గత మార్చి నెల క్వార్టర్ లో మొత్తం ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది .
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువవ్వడంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు .
గత ఏడాది ఇదే సమయంలో మొత్తం పదకొండు వేల ఏడు వందల నలబై కోట్లకు పైగా మొండి బకాయిలుంటే ఈ ఏడాది త్రైమాసికంలో రెండింతలు పెరిగి మొత్తం ఇరవై ఎనిమిది వేల తొంబై ఆరు కోట్ల రూపాయలతో బ్యాంకు తీవ్ర నష్టాలను చవిచూసిందని వారు తెలిపారు ..