తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.తాజాగా కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు ఉన్న ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అభ్యర్తేనని, 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకే దిక్కులేదని ఈ సందర్భంగా అయన వాపోయారు. పాదయాత్రపై రేవంత్ రెడ్డికి తొందర ఎందుకు అని అడిగారు. అభ్యర్థులను సెంట్రల్ ఎన్నికల కమిటీ ఎంపిక చేస్తుందని, పార్టీ తరుపున వ్యక్తిగత పాదయాత్రలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసి పనిచేద్దామని కోమటి రెడ్డి నేతలకు పిలుపునిచ్చారు.కాగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోమటిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.