జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రజలున్న ఏడు మండలాల్లో ప్రజలందరికీ వెంటనే రక్షిత మంచి నీటిని అందించాలని ..వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు .
శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
ఒకవేళ చంద్రబాబు దిగిరాకుంటే తన యాత్రను ఆపేసి, ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతానని, ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చారు అన్నారు.