కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, నల్గొండ ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా అనూహ్యమైన షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్న కోమటిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై సదభిప్రాయం లేకపోవడం వల్లే సస్పెన్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మద్దతుగా నిలబడటం లేదనే భావన ఉంది.
ఇదిలాఉండగా కోమటిరెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఆయనకు లేఖ రాశారు. ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు తన శుభాకాంక్షల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, తనకు శభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.