నిత్యం ఏదో ఒక సమస్యలతో వివాదాల్లో ఉండే అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.ఈ రోజు రాష్ట్రంలోని గుత్తి లో మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన గుత్తి మున్సిపల్ చైర్‌పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ వార్నింగ్ ఇచ్చారు.జేసీ ఒక్కసారిగా అలా అనడంతో అక్కడున్నవారు అవాక్కు అయ్యారు.అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
