ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్-JDS కూటమి ప్రభుత్వం కొలువదీరనుంది. కూటమి నుంచి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత H.D.కుమారస్వామి ప్రమాణ చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వర ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.అయితే ఈ కార్యక్రమానికి తాను హాజరు అవుతున్నట్లు ఇప్పటికే మక్కల్ నీదిమయ్యమ్ పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ బహిర్గతంగా తెలిపారు.అంతేకాకుండా UPA చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతోపాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి,బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబునాయుడు,సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తదితరులు హాజరు కానున్నట్లు బెంగళూరు వర్గాలు వెల్లడించాయి