అవును ఇది క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..దక్షిణాఫ్రికా పరుగుల వీరుడు, ప్రముఖ క్రికెటర్ ఎబి డివిలియర్స్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. డివిలియర్స్ నిర్ణయం అభిమానులను నివ్వెరపర్చింది. ఐపిఎల్లో బెంగళూరు తరపున ఆడిన డివిలియర్స్ మంచి ఫాం కనబరిచి పరుగుల వరదను పారించారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డివిలియర్స్ మధ్య తీవ్ర పోటీ ఉంది. వీరిద్దరిని గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచ ప్రజలు గుర్తించారు. డివిలియర్స్ చేసిన ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.
