కేంద్ర మాజీ మంత్రి, సికింద్రబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.అయన కుమారుడు వైష్ణవ్ రాత్రి(మంగళవారం,మే-23) గుండెపోటుతో చనిపోయారు.రాత్రి ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు వైష్ణవ్ ను ముషీరాబాద్ లోని గురునానక్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పన్నెండున్నరకు కన్నుమూశారు.
వైష్ణవ్ కు 21 ఏళ్ల. వైష్ణవ్ ప్రస్తుతం MBBS మూడో ఏడాది చదువుతున్నారు. వైష్ణవ్ దత్తాత్రేయకు ఒక్కడే కుమారుడు. చిన్నవయసులో గుండెపోటుతో వైష్ణవ్ మృతి చెందడంపై బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాత్రి హాస్పిటల్ కి వెళ్లి నివాళి ఆర్పించారు. సన్నిహితులు,మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.అయితే దత్తాత్రేయ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియనీయలేదు. ఉదయం 5 గంటలకు కుమారుడి మరణ వార్తను విన్న దత్తాత్రేయ కన్నీరు మున్నీరు అయ్యారు.