కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామితో ఈ రోజు ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో ఉహించని సన్నివేశం చోటు చేసుకుంది.ఒకే వేదికపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి వంటి హేమాహేమీలంతా కొలువుదీరారు.మొదటగా కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఆ తరువాత ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం వేదికపై ఉన్న పెద్దలంతా ఒకరితో మరొకరు కరచాలనం చేసుకుంటూ, చేతులు గాల్లో ఊపుతూ సంతోషంగా గడిపారు.
ఇంతలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి, అభినందించారు. కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకోవడానికే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, టీడీపీ అధినేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడటం… ఊహించనటువంటి ఒక కొత్త సన్నివేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.