అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధుకు పెద్ద ఎత్తున తరఫున ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా బ్రిక్స్ సదస్సులో రైతుబంధును ఆయా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఢిల్లీలో 20 దేశాలతో కూడిన బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. దాదాపు 20 దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు సమావేశంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్, రైతు బంధు పథకంపై సమావేశంలో వివరించానని వివరించారు. తెలంగాణ తరుపు బ్రిక్స్ సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొనాల్సి ఉందనిఅయితే, రాష్ట్రంలో బిజీ షెడ్యూల్ నేపథ్యంలో మంత్రి సూచన మేరకు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా తాను పాల్గొన్నట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రతిష్టాత్మకమైన ఐపాస్, రైతుబంధు పథకం పై వివిధ దేశాల ప్రతినిధులు ఆసక్తి చూపారని వేణుగోపాలచారి వెల్లడించారు. రైతుకు పంట సాయం ఇవ్వడం ప్రశంసనీయమని వారు అన్నట్లు చారి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరగా త్వరలోనే తెలంగాణ లో పర్యటిస్తామని ప్రతినిధులు తెలిపారని వివరించారు. 24 గంటల విద్యుత్, నీరు, మౌళిక సదుపాయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చేస్తోన్న కృషిని వారు స్వాగతించారని తెలిపారు. బ్రిక్స్ సమావేశం లో దాదాపు 45 నిమిషాల పాటు తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు వివరించారు.