ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జోరుగా సాగుతన్నాయి.
ఇలా జగన్‌కు పెరుగుతున్న క్రేజ్‌తోపాటు.. ఇటీవల పలు సంస్థలు వెల్లడి చేసిన సర్వేల్లోనూ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటూ తేల్చేశాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మంత్రి స్థాయిలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే స్థాయిలో విభేదాలు తలెత్తాయి. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మంతనాలు జరిపారని ఆ సోషల్ మీడియా కథనం పేర్కొంది. ఇదే నిజమైతే ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటక ముందే జగన్ సమక్షంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నారు.