ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జగన్ అన్న ఎప్పుడెప్పుడు వస్తారా..? అంటూ వేచి చూసిన ప్రజలు అశేషంగా తరలి వస్తున్నారు.
చంద్రబాబు సర్కార్ పాలనలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్‌కు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారి కన్నీళ్లను తుడుస్తూ.. ప్రజలకు భరోసానిస్తూ వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ఇలా నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణ చేస్తున్న జగన్‌పై, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అధికార టీడీపీ భారీ కుట్రకు తెర లేపిందని ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది.
ఆ సోషల్ మీడియా కథనం ప్రకారం.. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ,ఎంపీలను సంతలో గొర్రెలను కొన్నట్లు కోట్లు కుమ్మరించి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనేసి పచ్చ కండువా కప్పిన విషయం తెలిసిందే. జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు సర్కార్.. ఆపరేషన్ ఆకర్ష్ – 2కు తెర తీసింది. కోట్లు కుమ్మరించి మరికొంత మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు 400 కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది. అయితే, ఆ ఎమ్మెల్యే టీడీపీ చూపిన కోట్ల రూపాయల నిధిని తన ఎడమ కాలితో తన్నినట్టు సమాచారం.
ఏదేమైనా ఇప్పటికే అవినీతి, అక్రమాలు, మహిళలపై దాడులు, ప్రాజెక్టు పనుల్లో కమీషన్లతో తీవ్ర స్థాయిలో అవినీతి కుంభకోణాల్లో మునిగి పోయి ప్రజల్లో ఆదరణ కోల్పోయిన టీడీపీ.. ఇక త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో .. ఓటమి భయంతోనే ఆపరేషన్ ఆకర్ష్ – 2కు తెరతీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.