అతను క్రికెట్ గ్రౌండ్‌లోకి కాలు పెడితే అభిమానుల ఆనందానికి అంతు ఉండదు. కుడి, ఎడమ వైపు మాత్రమే కాదు.. వెనుకా.. ముందు అన్ని సైడ్‌లలోనూ బౌలర్ వేసే బంతికి తన బ్యాట్‌తో సమాధానం చెబుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. అతను క్రీజులో ఉన్నంత వరకు ఆ స్టేడియం క్రికెట్ అభిమానుల కేరింతలతో నిండి పోతుంది. అందుకు కారణం అతను ఆడే ఆట తీరే. బౌండరీలే లక్ష్యంగా అతని ఆట ప్రారంభమవుతుంది. చివరకు హాఫ్ సెంచరీలు, సెంచరీలతోనే అతని ఆట ముగుస్తుంది. అతను క్రీజులోకి దిగితే ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక చిన్న భయం.. అతను ఔటైతే అదే ఆటగాళ్లకు కొండంత ఉపశమనం. కోట్లాది మంది అతని అభిమానులు. అతనే ఏబీ డివిలియర్స్.
అటువంటి ఏబీ డివిలియర్స్ ఇవాళ క్రికెట్ అభిమానులకు సంచలన విషయం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఏబీ డివిలియర్స్ ప్రకటించాడు. కాగా, ఏబీ డివిలియర్స్ ఇప్పటి వరకు 123 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ-20లు ఆడాడు. అయితే, 123 టెస్ట్‌ల్లో 8,765 పరుగులు, 228 వన్డేల్లో 9,577 పరుగులు చేశాడు. టెస్టుల్లో 22, వన్డేల్లో 25 సెంచరీలు ఉన్నాయి. ఒక్కసారిగా.ఊహ\. అనుకోని సమయంలో.. డెడివిలియర్స్ ఇలా రిటైరమెంటర్మెంట్ పరకపప్రకటించడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా నిరాశ చెందుతున్నారు.